Thursday, May 2, 2024

శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’    

- Advertisement -
- Advertisement -

వైజయంతీ మూవీస్ పాత్-బ్రేకింగ్ ప్రాజెక్ట్  ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ఈ యునిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాప్ కల్చర్ ఈవెంట్‌ సెలబ్రేట్ చేసుకోనుంది.

అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో ప్రభాస్ పాత్రను క్యారికేచర్‌గా చూపించారు. పోస్టర్ లో ప్రత్యేక శక్తులతో సూపర్ హీరోగా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఆకట్టుకునే సంభాషణలు, మరపురాని పెర్ఫార్మెన్స్ నిర్వహిస్తుంది. ఇండియన్ కల్చర్, సైన్స్ ఫిక్షన్ ప్రపంచం గురించి ఒక గ్లింప్స్ అందిస్తుంది.

ప్రత్యేక అతిథులు ఉలగనాయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్లు ప్రభాస్ , దీపికా పదుకొణె, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కూడిన ఎక్సయిటింగ్ ప్యానెల్‌తో SDCC వేడుక జూలై 20వ తేదీన ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ K  క్రియేటర్స్ చిత్రం  టైటిల్, ట్రైలర్,  విడుదల తేదీని లాంచ్ చేస్తారు, కామిక్-కాన్ వేదికగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందజేస్తారు.

ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఇండియా చాలా గొప్ప కథలు, సూపర్ హీరోలకు నిలయం. మా చిత్రం దీనిని ప్రపంచానికి తెలియజేయడానికి, పంచుకోవడానికి చేసిన ప్రయత్నమని భావిస్తున్నాము.  కామిక్ కాన్ మా కథను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సరైన వేదికను అందిస్తుంది” ఆన్నారు.

నిర్మాత అశ్వనీ దత్ తన ఆనందం వ్యక్తం చేస్తూ, “భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా, ఈ అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది. మన దేశంలోని అతి పెద్ద సూపర్‌స్టార్‌లతో చేతులు కలుపుతూ, భారతీయ సినిమా సరిహద్దులను అధిగమించి మేము కొత్తగా అడుగు వేస్తున్నాం. వరల్డ్ మ్యాప్‌లో భారతీయ సినిమాను చూడాలని కోరుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణమైన క్షణం. కామిక్ కాన్ మాకు వరల్డ్ స్టేజ్.”అన్నారు

ప్రాజెక్ట్ K  వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న మల్టీ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ తారాగణం, ప్రతి ఒక్కరు కీలకమైన పాత్రలను పోషిస్తూ ఎక్స్ టార్డీనరి చిత్రంగా మలచడంలో దోహదపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News