Tuesday, April 30, 2024

ఐటమ్‌సాంగ్‌లో ప్రగ్యా

- Advertisement -
- Advertisement -

Pragya Jaiswal in F3 movie Item Song

 

వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ‘ఎఫ్ 2’కు సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ రూపొందుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసిన అనీల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఐటమ్ సాంగ్‌ను ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌తో చేయించబోతున్నారట. ‘ఎఫ్ 2’లో జబర్దస్త్ బ్యూటీ అనసూయ ప్రత్యేక పాటలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాట ప్రత్యేకంగా నిలిచి మాస్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడు ‘ఎఫ్ 3’లో కూడా అంతకు మించి అన్నట్లుగా ఐటమ్ సాంగ్‌ను అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా ఈమధ్య కాలంలో అంతగా ఆఫర్లు దక్కించుకోలేక పోతోంది. అనుకోని అవకాశం అన్నట్లుగా ఆమెకు ‘అఖండ’ సినిమాలో అవకాశం దక్కింది. ఇప్పుడు ‘ఎఫ్ ౩’లో ఈ బ్యూటీకి ఐటమ్‌సాంగ్ ఆఫర్ దక్కడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News