Monday, May 13, 2024

‘కెజిఎఫ్ 2’లో ప్రకాష్‌రాజ్..

- Advertisement -
- Advertisement -

Prakash Raj to play lead role in KGF 2 movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘కెజిఎఫ్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘కెజిఎఫ్ 2’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్ బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొనడం విశేషం. తాను ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నట్టు ప్రకాష్ రాజ్ స్వయంగా తెలిపాడు. చాలా తక్కువమంది సిబ్బందితో నీల్ ఈ షూటింగ్‌ను ఆరంభించాడు. అయితే ఈ చిత్రంలో హీరో రోల్ తో పాటు అంతటి ప్రాధాన్యత ఉన్న నెగటివ్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ ఎప్పుడు మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడు? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Prakash Raj to play lead role in KGF 2 movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News