Sunday, September 21, 2025

ప్రసార భారతి సిఈవో కెఎస్ శర్మ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రసార భారతి మాజీ సిఈవో కె.ఎస్ శర్మ(80) శనివారం హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన కెఎస్ శర్మ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విశేష సేవలు అందించారు. తన సర్వీసులో కొంతకాలం పాటు దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ పనిచేసి ఆ తర్వాత ప్రసార భారతి సిఈవోగా 2006 వరకు సేవలు అందించారు. దూరదర్శన్ డైరెక్ట్ టు హోమ్, డిడి డైరెక్ట్ ప్లస్ వంటి సేవలను అందించడంలో శర్మ కీలక పాత్ర పోషించారు.

కెఎస్ శర్మ గత కొన్ని రోజులుగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెఎస్ శర్మ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రసార భారతి సీఈవోగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వ్యవస్థాపక సీఈవోగా, ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి కార్యాలయంలో ముఖ్య అధికారిగా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా, నవోదయ విద్యాలయాల స్థాపకుడిగా కెఎస్ శర్మ విశేషంగా సేవలు అందించారు. కెఎస్ శర్మ మృతిపట్ల పలువురు సర్వీసులో ఉన్న ఐఎఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News