Tuesday, May 7, 2024

మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
రవీంద్రభారతిలో ఘనంగా ఏర్పాట్లు చేసిన మహిళా శిశుసంక్షేమ శాఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్ తోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గం కేంద్రాలలో మహిళా సదస్సు నిర్వహిస్తారు. ఈ సదస్సులో అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, ఇతరులు వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా చర్యలు చేపట్టారు. ఈ సదస్సులో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసిఆర్ కిట్, న్యూటీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీఎల్‌ఆర్, షీ టీమ్స్, వి హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర విషయాలన్నింటిని తెలియజేస్తారు.

అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలకు, ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా తెలియచేస్తారు. మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుపుతూ, ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలనే ఆదేశాలు జారీచేశారు. ఈ తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులందరూ పాల్గొనేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

నేడు ఘనంగా రవీంద్ర భారతీలో….
తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రవీంద్ర భారతిలో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరైతారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మహిళా కమీషన్ చైర్మన్ సునీతా లక్ష్మా రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల శ్రీలత తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కిశోరామృతం, ఆరోగ్య లక్ష్మి తదితర కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపర్చిన బాలికలు, విద్యార్థినులు, మహిళలకు అవార్డుల ప్రధానం చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News