Tuesday, May 14, 2024

అటల్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ (వీడియో)

- Advertisement -
- Advertisement -

PM Modi to inaugurate Atal Tunnel in Rohtang

సిమ్లా : హిమాలయ పర్యతాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాజ్‌నాథ్ శుక్రవారమే అక్కడికి చేరుకున్నారు. ఈ సొరంగ మార్గం వల్ల మనాలీ, లేహ్ మధ్య ప్రయాణ దూరం 46 కిలోమీటర్లు, సమయం 45 గంటలు తగ్గనున్నది.

హిమాలయాల్లోని పీర్‌పంజాల్ ప్రాంతంలో నిర్మించిన అటల్ టన్నెల్ పొడవు 9.02 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తున నిర్మించిన ఈ టన్నెల్‌లో అన్ని రకాల వాతావరణాల్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ టన్నెల్ నిర్మాణానికి రూ.3300 కోట్లు ఖర్చయింది. వాహనాల రాకపోకలకు రెండు మార్గాల రహదారిని ఈ టన్నెల్ లోపల నిర్మించారు. దేశ సరిహద్దున సైనికులకు అవసరమైన సరఫరాల కోసం ఈ టన్నెల్‌ను వినియోగించనున్నారు.

Prime Minister Modi inaugurates Atal Tunnel

PM Modi to inaugurate Atal Tunnel in Rohtang

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News