- Advertisement -
సూర్యాపేట: మద్యం మత్తులో 12 నెలల కూతురిని కసాయి తండ్రి నేలకేసి కొట్టడంతో చనిపోయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు గొడవ పడుతుండగా 12 నెలల పసికందు ఏడ్చింది. దీంతో ఏడుపుకు ఇరుగుపొరుగువారు వస్తారని వెంటనే కూతురును నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కూతురును స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కూతురు దుర్మరణం చెందింది.
Also Read: తెలంగాణలో రీడింగ్ క్యాంపెయిన్
- Advertisement -