Saturday, May 4, 2024

షాక్‌కు గురయ్యా : ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ వార్త విని షాక్‌కు గురైనట్టు చెప్పారు. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతుంటే , భారత్ తన విధానాలకు విరుద్ధంగా మౌనంగా ఉండటం సరికాదన్నారు. ఈమేరకు ఆమె ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. “ గాజాలో కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్ దూరంగా ఉందని తెలిసి షాక్‌కు గురయ్యాను.

ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యం, అహింస అనేవి భారత దేశానికి మూలస్తంభాలు. వాటికోసం ఎంతో మంతి స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. అంతర్జాతీయ సమాజంలో భారత్ తన గళం వినిపిస్తే, వాళ్లంతా నైతిక ధైర్యాన్నిస్తారు. అలాంటిది… ప్రస్తుతం పాలస్తీనాలో సాధారణ ప్రజలకు ఆహారం, నీరు వైద్య సామగ్రి, విద్యుత్ అందకుండా ఇజ్రాయెల్ ఆడుకుంటోంది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకించకుండా మౌనంగా నిలబడటం సమంజసం కాదు” అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News