Sunday, April 28, 2024

వేధింపులు తాళలేక మంత్రి హత్యకు కుట్ర

- Advertisement -
- Advertisement -

Progress in conspiracy to assassinate Minister Srinivas Gowd

హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు జరిగిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు విచారణలో పురోగతి సాధించారు. మంత్రి హత్యకు జరిగిన కుట్రలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై పోలీసుల కీలక విషయాలన సేకరించారు. ముఖ్యంగా మంత్రి హత్యకు సంబంధించిన రూ.15 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. అలాగే నిందితులను ఆశ్రయం కల్పించిన మాజీ ఎంపి జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు. మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణల పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురు నిందితులకు గురువారం నాడు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి నివాసంలో పేట్‌బషీరాబాద్ పోలీసులు హాజరు పరిచారు. దీంతో నిందితులకు రిమాండ్ విధించడంలో వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన మొత్తం ఎనిమిది మంది నిందితులను వారం రోజులు కస్టడీ కోరుతూ మేడ్చల్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

మంత్రి హత్యకు ప్లాన్ : రాఘవేంద్ర రాజు

మంత్రి హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసు విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. మహబూబ్‌నగర్‌కు చెంది న రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చా యి. ఈక్రమంలో 2017 నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్థికంగా తనను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు తనను చంపేందుకు ప్రయత్నం చేశాడని నిందితుడు రాఘవేంద్రరాజు వెల్లడించాడు. మంత్రి వేధింపులు తట్టుకోలేకే చంపాలనుకున్నామని తేల్చిచెప్పాడు.

గడచిన నాలుగేళ్ల కా లంలో మంత్రి తనపై 30 కేసులు పెట్టించారని, ఈ క్రమంలో ఒకే రోజు తనపై 10 కేసులు పెట్టించాడని వివరించాడు. మహమూబ్‌నగర్‌లో బార్‌షాప్‌ను మూసివేయించి ఇబ్బందులకు గురిచేశాడని, ఆర్థికంగా కూడా నాకు నష్టం చేయించాడని తెలిపారు. మంత్రి వల్ల తనకు రూ.6 కోట్లు నష్టం రావడంతో పాటు తనకు రావాల్సిన డబ్బులను రాకుండా అడ్డుకున్నాడని రాఘవేంద్రరాజు విచారణలో తెలిపాడు.తన వ్యాపారాలను దెబ్బతీసి, తనను ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు అనేక ఇబ్బందులకు గురిచేశాడని, క్రమంగా కేసులు నమోదు చేయించడంతో పాటు తన రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశాడన్న కారణంతో మంత్రిని హత మార్చేందుకు కుట్ర పన్నినట్లు వివరించాడు. దీంతో పాటు అక్రమంగా ఎక్సైజ్ కేసులు నమోదు చేయించాడని, తన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రద్దు చేయించాడని, అన్ని విధాలుగా తన నష్టాలకు గురిచేసిన మంత్రి హత్యకు కుట్ర పన్నినట్లు నిందితుడు రాఘవేంద్రరాజు విచారణలో వెల్లడించాడు.

ఆయుధాలు,ఆశ్రయంపై విచారణ

మహబూబ్‌నగర్‌కు చెందిన మార్కెట్ చైర్మన్ అమరేందర్ రాజు, ఆయన సోదరులు రాఘవేంద్రరా జు, మధుసూదన్‌రాజు, నాగరాజు, మున్నూర్ రవి కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆయుధాల సేకర ణ, రూ. 15 కోట్ల నిధులపై విచారణ సాగిస్తు న్నారు. అలాగే అమరేందర్ రాజు, రాఘవేంద్ర రాజు, మధుసూదన్ రాజు, మున్నూర్ రవి డిల్లీలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్‌లో తలదాచుకున్న అంశంపై దర్యాప్తు చేపడుతున్నా రు. ఈ మేరకు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కీలక సాక్షాలను సేకరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News