Saturday, May 4, 2024

నిందితుడిని కానప్పుడు సమన్లు ఎందుకు

- Advertisement -
- Advertisement -

ఇడికి కేజ్రీవాల్ సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో తాను నిందితుడిని కానప్పుడు పదే పదే తనకు ఎందుకు సమన్లు పంపుతున్నారని ఢిలీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)ని ప్రశ్నించారు. ఇడి పంపిన నాలుగవ సమన్లకు కూడా కేజ్రీవాల్ స్పందించలేదు. గురువారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ గత వారం ఇడి నాలుగవ సారి కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది. వరుసగా నాలుగవ సమన్లను కూడా పట్టించుకోని కేజ్రీవాల్ తాను రానున్న లోక్‌సభ ఎన్నికలలో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు తనను అరెస్టు చేయాలని ఇడి భావిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో కేజ్రీవాల్ నిందితుడు కానప్పుడు ఎందుకు ఆయనకు పదేపదే సమన్లు పంపుతోందని కేజ్రీవాల్ తరఫున విడుదల చేసిన ప్రకటనలో ఆప్ ప్రశ్నించింది. తమ పార్టీ నాయకులెవరూ ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, ఇడి బెదిరింపులకు భయపడి బిజెపిలో చేరే ప్రస్తి లేదని ఆప్ స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News