Tuesday, May 21, 2024

ఇనార్బిట్ మాల్ లో ప్రాజెక్ట్ ధనుష్ శక్తి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, K రహేజా కార్ప్ గ్రూప్ కంపెనీ ఇనార్బిట్ మాల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాణ్‌ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని ప్రాజెక్ట్ ధనుష్ శక్తి ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా యువ ఆర్చర్, తానిపర్తి చికిత విజయానికి అవసరమైన విలువిద్య సామగ్రిని అందించడం తో పాటుగా ఆమె కు తిరుగులేని మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో శ్రవణ్ కుమార్ గోనె, COO (తెలంగాణ & AP), K రహేజా కార్ప్, శరత్ బెలవాడి, సెంటర్ హెడ్, ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, మయూర్ పట్నాల, వ్యవస్థాపకుడు, సీఈఓ, నిర్మాణ్ సంస్థ, బృందం సమక్షంలో జరిగింది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత కేవలం ఆర్చర్‌గానే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక పిల్లలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రస్తుతం సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న ఆమె 8వ తరగతిలో తన విలువిద్య ప్రయాణాన్ని ప్రారంభించింది. 2021 సబ్-జూనియర్ నేషనల్ గేమ్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించింది. ఆసియా క్రీడలు, ఆర్చరీ ప్రపంచ కప్, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్ 2028లో పాల్గొనాలని ఆమె ఆకాంక్షించారు. ఆమె మే 2023లో ఆసియా కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం థాయిలాండ్‌లో అక్టోబర్ 2023లో జరగనున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News