Thursday, May 2, 2024

త్వరలోనే ప్రజా రవాణా… కేంద్ర మంత్రి గడ్కరీ హామీ

- Advertisement -
- Advertisement -

Nitin Gadkari

 

న్యూఢిల్లీ: కొన్ని మార్గదర్శకాలతో దేశంలో ప్రజా రవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర రహదారులు, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనా ప్రభావంతో దేశంలో మార్చి 24 నుంచి దశల వారిగా లాక్‌డౌన్ సాగతున్న దశలో ప్రజా రవాణా స్తంభించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే రవాణా పునరుద్ధరణ ఉంటుందని గడ్కరీ తెలిపారు. బుధవారం ఆయన రవాణాదార్లతో మాట్లాడి, వారికి తగు హామీ ఇచ్చారు. నిర్థిష్టమైన మార్గదర్శకాల మధ్య ప్రజా రవాణకు వీలుంటుందని వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో ప్రజలలో నమ్మకాన్ని పెంచేందుకు రవాణా వ్యవస్థ కీలకం అని, అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సులు, కార్లు ఇతరత్రా వాహనాల రాకపోకలను నడిపించాల్సి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భౌతిక దూరం పాటించాలి.

మాస్క్‌లు ధరించడం, శానిటైజైషన్, చేతులు కడుక్కోవడం ఇతరత్రా అన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని, అప్పుడే ఈ రవాణా వ్యవస్థ ఆరోగ్యపరంగా సాఫీ ప్రయాణంగా ఉంటుందన్నారు. ప్రజలపైనే ఎక్కువగా బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బస్సు అండ్ కార్ ఆపరేటర్స్ కాన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీ వరకూ అమలులో ఉంటుంది. అప్పటివరకూ విమానాలు, రైల్వేలు ఇతరత్రా అంతరాష్ట్ర రవాణా సౌకర్యాలకు వీలు లేదు. అయితే ఇప్పుడు వలస కూలీలను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 100 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారు. ఇప్పుడు కరోనాతో దేశం, పరిశ్రమ రెండు యుద్ధాలను సాగిస్తున్నాయని, ఒకటి కరోనా వైరస్‌తో సాగే పోరు , మరోటి ఆర్థికమాంద్యంతో సాగే సంఘర్షణ అని తెలిపారు.

ఈ రెండింటిలోనూ విజయం సాధించి తీరుతామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పటినుంచి దేశంలో పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థ పునః ప్రారంభం అనేది మంత్రి నిర్థిష్టంగా తెలియచేయలేదు. ప్రజా రవాణా రంగంలో ఉన్న తమకు ఇప్పటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తగు విధంగా సాయం చేయాలని సమాఖ్య ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వడ్డీ మినహాయింపుల కొనసాగింపు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పునరుద్ధరణ, వాహన కాల పరిమితి పెంపు, రాష్ట్ర పన్నుల వాయిదా, ఎంఎస్‌ఎంఇ ప్రయోజనాల వర్తింపు, బీమా పాలసీ చెల్లుబాటు కాలం పొడిగింపు వంటి వాటిపై కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అపార నష్టాలలో ఉన్న తమ పరిస్థితి మెరుగు అయ్యేందుకు ఇటువంటి చర్యలు అత్యవసరం అని తెలిపారు.

Public Transport May Open Soon says Gadkari
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News