- Advertisement -
పుణె: జిల్లాలోని ఖేడ్ తాలూఖాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భక్తులతో ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. కుందేశ్వర్ (Pune Kundeshwar) ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మహిళలు శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా మహిళలు కుందేశ్వర్కు దర్శనం కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంటల సమయంలో కుందేశ్వర్ గుట్ట మొదటి మలుపు తిరుగుతుండగా.. వాహనం అదుపు తప్పి 100 నుంచి 150 ఫీట్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గాయపడిన వారిని వెంటనే చదౌలిలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -