Monday, September 25, 2023

తెలంగాణ వడ్లు…వడ్లు కావా?: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Puvvada Ajay Kumar comments on Modi govt

ఖమ్మం: తెలంగాణలో యసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రధాన రహదారిపై మండల పార్టీ అద్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు.

తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొనాలని రైతులపై కేంద్రం కక్ష ఎందుకు పెంచుకుందని ప్రశ్నించారు. మా వడ్లు.. వడ్లు కావా ఆని అడిగారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అని కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు.

దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుందని, కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బిజెపి కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయి అది సహజం.. దిగుబడి తగ్గుతది అందుకే ఇక్కడ బాయిల్ చేస్తాం ఆది కేంద్రానికి తెలుసునని, గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇపుడు ఎందుకు వద్దు అంటున్నారు అని ప్రశ్నించారు. ఇది కక్ష్యా సాధింపు చర్య కాదా? అని పువ్వాడ నిలదీశారు.

ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారని, ఇది చాలా బాధాకరమని, తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండి అనటం సిగ్గుచేటన్నారు. రైతులను కించపరిచే విధంగా బిజెపోళ్లు హీనంగా, ఘోరంగా మాట్లాడుతున్నారని,  రైతులు ఎక్కడైనా రైతులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

వరి వేస్తే ప్రతి గింజ కొనే బాధ్యత బిజెపిది అని బండి సంజయ్ ప్రకటించారని, రైతులకు హామీ ఇచ్చారు.ప్రతి గింజా కొంటామన్నారని గుర్తు చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు యసంగిలో పండించిన వడ్లను కొనల్సిందే అని, తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు.. వడ్లు కావా ఆని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

బిజెపి ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అది కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుందని,  కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బిజెపి కక్ష పెట్టుకొని పేచీలు పెడుతుందని విమర్శించారు. నలుగురు మంత్రులు, 8మంది ఎంపిలు ఇతర ప్రతినిధులు ఢిల్లీ కి వెళ్తే కేంద్ర మంత్రి మమ్మల్ని కలవడానికి ఇబ్బంది పడ్డారని, రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి కించ పరిచేలా వ్యవహరించటం బాధాకరమన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం పలు మార్లు వరి వేయమని, కొంటామని పదే పదె ప్రకటించారని, అది బాయిల్ అయిన రా-రైస్ అయిన కొంటామన్నారని, ఇపుడు మాటమార్చడం సిగ్గుచేటన్నారు. మీరు వడ్లు కొనం అనటమే సమస్య అని, అందుకే తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకవచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు విస్తారంగా పండిస్తున్నారంటే కారణం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి ప్రధాన కారణమని వివరించారు. కేంద ప్రభుత్వం అందించే ఎరువులపై 20శాతం సబ్సిడీని తగ్గించారని తద్వారా ఎరువుల ధర పెరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ వడ్లు కొనాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూస్తారని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News