Thursday, May 2, 2024

జేపిఎస్‌ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పట్ల సీఎం కెసిఆర్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ నాలుగేళ్లుగా వారితో పని చేయించుకొని ఇప్పుడు వారిపై వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. జేపిఎస్‌లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు వ్యవహరిస్తోన్న తీరు సక్రమంగా లేదన్నారు. ఓవైపు బలవన్మరణాలకు పాల్పడుతున్నా శనివారం విధుల్లో చేరకపోతే కొత్త వారిని నియమించుకుంటామని పేర్కొన్నడం ఉద్యోగులు రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఉపాధి మార్గం చూపించాలన్నారు. ఈసందర్భంగా ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన జేపిఎస్ బైరి సోనికి నివాళిగాఈ ప్రతి గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించాలని, పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. ఒకరి కోసం అందరం కోసం ఒకరం అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News