Thursday, May 2, 2024

ఆంక్షలు సరైనవి కావు

- Advertisement -
- Advertisement -

ఓటీటీ ఇన్నాళ్లు స్వేచ్ఛా విజువల్ మాధ్యమంగా అలరించింది. దీనివల్ల బోలెడంత క్రియేటివిటీని మేకర్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ మాధ్యమంలో అవకాశాలు పెరిగాయి. కానీ, ఇప్పుడు రూల్స్ మారబోతున్నాయి. మునుముందు ఓటీటీలపై ఆంక్షలు పెరగబోతున్నాయని సంకేతం అందింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఓటీటీలకు ముకుతాడు వేయబోతోంది. అయితే ఇది సరైనదేనా? అని ప్రశ్నిస్తే.. అందాల కథానాయిక, ఓటీటీ స్పెషలిస్ట్ రాధికా ఆప్టే మాట్లాడుతూ.. “ఓవర్- ద-టాప్ (ఓటీటీ) ప్లాట్ ఫామ్‌లు నిజానికి భయానక సన్నివేశాన్ని ఎదుర్కోబోతున్నాయి. ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు సరైనవి కావు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రేక్షకులకు విభిన్నమైన కంటెంట్ ను అందించడమే కాకుండా దేశీయ, అంతర్జాతీయ కళాకారులకు, మేకర్స్‌కి మధ్య వంతెనగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు పనిచేస్తున్నాయి. ఈ వేదిక చాలా అవకాశాలను, ఉపాధిని ఇచ్చింది” అని పేర్కొంది.

Radhika Apte Reacts on OTT Restrictions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News