Friday, May 3, 2024

కొత్త చట్టాల రద్దుతోనే పరిష్కారం: రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi criticised central government

 

కష్టాలు నష్టాలపై బుక్‌లెట్ల విడుదల

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు దేశంలో వ్యవసాయాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బాగా సాగే వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగానే ఈ చట్టాలు రూపొందించినట్లుగా ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి సంక్లిష్టం అయింది. చట్టాల రద్దు ఒక్కటే పరిష్కార మార్గం అని తేల్చిచెప్పారు. మంగళవారం రాహుల్ గాంధీ ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు కొత్త చట్టాలతో రైతులకు తలెత్తిన కడగండ్లను వివరించే ఓ బుక్‌లెట్‌ను అంతకు ముందు రాహుల్ విడుదల చేశారు. చట్టాలు మా కొద్దంటూ ఉద్యమిస్తోన్న రైతాంగానికి తాను నూటికి నూరుపాళ్లు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తానే కాదు ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా రైతులకు బాసటగా నిలవాల్సి ఉందన్నారు. రైతులు వారి కోసం కాదు మనకోసం, దేశానికి అత్యవసరం అయిన వ్యసాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు. రైతులకు కష్టాలు మిగిల్చే చట్టాలతో నష్టాలే మిగిలాయని, ఇవి తీరాలంటే ముందు చట్టాలు తొలిగిపోవల్సి ఉందని చెప్పారు. చర్చలలో ప్రతిష్టంభనకు చట్టాలే కారణం అని, ఇవి పోతే కానీ పరిష్కారం సాధ్యం కాదని రాహుల్ స్పష్టం చేశారు.

ఎవరికి భయపడేది లేదు

తను ప్రధాని మోడీకి కానీ ఇతరులు ఎవరికి భయపడేది లేదని రాహుల్ తేల్చిచెప్పారు. తనను విమర్శిస్తూ బిజెపి అధ్యక్షులు నడ్డా చేసిన ట్వీట్లపై రాహుల్ స్పందించారు. నడ్డా వాస్తవాలను వక్రీకరించారని దాడికి దిగారు. రైతులకు ఎల్లవేళలా అండగా నిలిచింది రాహుల్ గాంధీ తప్ప నడ్డా కాదని రైతులకు తెలుసునన్నారు. తాను ఎవరికో భయపడి రైతుల పక్షాన గళం విప్పడం మానుకోనని తెలిపారు. ప్రధాని మోడీ కాని , ఇంకెవ్వరైనా కానీ తనకు భయం లేదని , మచ్చలేని వ్యక్తిని అని, వారు తనను టచ్ చేయలేరని హెచ్చరించారు. వారు తన కాల్చి పడేయవచ్చునని, అయితే ఎటువంటి ఆరోపణ చేయలేరని, ఎందుకంటే వాటిలో వాస్తవాలు ఉండవని అందరికీ తెలుసునని తెలిపారు. తాను దేశభక్తుడిని అని, దేశాన్ని రక్షించుకుని తీరుతానని, ఇది నిరంతరం సాగుతుందని తేల్చిచెప్పారు. ఇప్పుడు తాను విడుదల చేసిన సంకలనాలతో చట్టాలతో రైతులకు కలిగే కష్టాలు అందరికీ మరింతగా తెలిసివస్తాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News