Friday, May 3, 2024

భారీ క్లైమాక్స్ ఆరంభం

- Advertisement -
- Advertisement -

'RRR' special teaser will be released on 26th of this month

 

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, – మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో అలియా భట్,- ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే న్యూస్ అందించింది.

ఈ సినిమా భారీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైందని.. భీమ్, – రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈమేరకు తారక్, – చరణ్ ఇద్దరు చేతులను కలిపి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఇకపోతే ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, – శ్రియా, – సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News