Sunday, April 28, 2024

అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం

న్యూఢిల్లీ : దేశంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చాయంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత , ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు.

కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేతలు కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయాశ్రీనాథ్‌లకు యాపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. వీరితోపాటు ఎన్సీపీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్,ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సిపిఎం నేత సీతారాం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు. తన కార్యాలయం లోని చాలా మందికి ఇలాంటి సందేశాలు వచ్చినట్టు చెప్పారు. హ్యాకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అదానీని కాపాడేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటూ ధ్వజమెత్తారు. అయితే ఫోన్ ట్యాపింగ్‌లకు తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎంత ట్యాపింగ్ చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చని అన్నారు. తన ఫోన్ కావాలన్నా ఇస్తానని ట్యాపింగ్ చేసుకోవచ్చంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి కేంద్రం లోని బీజేపీ ఓర్వలేక పోతోందని, అందుకే విపక్షాలను ఇబ్బందులకు గురి చేయాలని భావిస్తోందని ఆరోపించారు.

విపక్ష ఎంపీల ఆరోపణలు
మంగళవారం ఉదయం విపక్ష ఎంపీలు తమ ఫోన్ల హ్యాకింగ్‌పై ఆరోపణలు గుప్పించారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చతుర్వేది, శశి థరూర్, పవన్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తమకు వార్నింగ్ మెసేజ్‌లు ఫోన్ కంపెనీల నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వంతో లింకున్న సైబర్ నేరగాళ్లు తమ ఫోన్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. హ్యాకర్లు ఎంపీల ఫోన్లను టార్గెట్ చేస్తున్నట్టు యాపిల్‌సంస్థ కొందరికి వార్నింగ్ మెసేజ్‌లను పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News