Monday, April 29, 2024

పార్లమెంటులో మరో ముగ్గురు ఎంపిల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపిల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం మరో ముగ్గురు లోక్‌సభ కాంగ్రెస్ ఎంపిలు ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపిలు డికె సురేశ్, దీపక్ బౌజ్, నకుల్‌నాథ్‌లను సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్‌కు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టారు. అంతకుముందు సభలో నిరసన తెలియజేస్తున్న ఈ ముగ్గురు ఎంపిలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. వీరి సస్పెన్షన్‌లో లోక్‌సభలో సస్పెండయిన ప్రతిపక్ష ఎంపిల సంఖ్య 100కు చేరుకుంది. గురువారం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యలు పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు.ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైనప్పుడు విపక్ష ఎంపిలు నినాదాలు చేస్తూ కనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News