Friday, May 10, 2024

ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్‌సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు చేపట్టింది. అనర్హత వేటు పడింది. కాగా రాహుల్ గాంధీ జైలు శిక్ష తీర్పును నిలిపివేయాలని కోరుతూ సూరత్ స్పెషల్ కోర్టులో అప్పీలు చేసుకున్నారు. దాని విచారణ ఏప్రిల్ 25న జరుగనున్నది. రాహుల్ గాంధీ తనకు కేటాయించిన బంగ్లాలో 2004 నుంచి ఉంటున్నారు. ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో ఆయన బంగ్లా ఇన్నాళ్లు ఉండింది. కానీ నేడు ఖాళీ చేశారు.

Rahul Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News