Sunday, April 28, 2024

రాజుకున్న రాజదండం వివాదం

- Advertisement -
- Advertisement -

న్యూ ఢిల్లీ: ఓ వైపు ప్రారంభోత్సవ ప్రధాన కర్తపై వివాదం చెలరేగుతున్న దశలోనే సెంగోల్ రాజదండం ప్రతిష్టాపనతో బిజెపి అంతర్గత పురాతత్వ విశ్లేషకులు అందించిన పాతచరిత్రను తీసుకుని తమిళనాడు మఠం నుంచి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు అందిన రాజదండం పార్లమెంట్‌లో ప్రతిష్టించే అంశం రాజకీయ రగడకు దారితీసింది. బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడికి ప్రతీక అయిన ఈ రాజదండాన్ని నెహ్రూ వర్గీయులు నిర్లక్షం చేసి చివరికి దీనిని ఓ ఊతకర్రగా మార్చేసినట్లు, మ్యూజియంకు పంపించినట్లు బిజెపి విమర్శించడం దీనిపై కాంగ్రెస్ నుంచి ఎదురుదాడి జరగడం చివరికి కొత్త పార్లమెంట్ ఆరంభోత్సవానికి ఎవరిని పద్ధతి ప్రకారం పిలవాలనే విషయం పక్కకు వెళ్లింది. సజావుగా సాగాల్సిన పార్లమెంట్ ప్రారంభోత్సవం ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం తీరున మారింది.

సెంగోల్ రాజదండాన్ని ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ ఆసనం వద్ద ప్రత్యేకంగా ఉంచుతారు. ప్రభుత్వం తన గొప్పతనాన్ని చాటుకోవడానికి మహిళా రాష్ట్రపతిని , దళిత నేతను కూడా పక్కకు నెట్టారని, ప్రజాస్వామ్య ప్రక్రియకు, పార్లమెంటరీ వ్యవస్థకు చివరికి ఈ విధంగా పార్లమెంట్ వేదిక ద్వారానే అవమానం చేశారని 20 ప్రతిపక్ష పార్టీలు బాయ్‌కాటుకు దిగాయి. 1947లో అధికార మార్పిడికి సెంగోల్ ప్రతీక అనే వాదనకు సరైన ప్రాతిపదికే లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్వపు చరిత్ర లండన్‌కు చెందిన ప్రముఖ పత్రికలలో 1947లో ప్రచురితం అయిందని, వాస్తవాలను కాదనడం కాంగ్రెస్ ఆనవాయితీ అని బిజెపి నేతలు మండిపడుతున్నారు.

రాజదండం ప్రతీకగా అధికారం మార్పు జరిగిందని చెప్పడమే అవాస్తవం, పైగా నెహ్రూ దీనిని అవమానపర్చారని చెప్పడం గతించిన నేతలపైబురద చల్లడమే అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఖరితో వివాదాస్పదం అయినందున తాము భవన ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని సమర్ధించుకున్న విపక్ష నేత నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఒమర్ అబ్దుల్లా వివాదం సంగతి పక్కకు పెడితే ఈ కొత్త భవనం అత్యద్భుతంగా , శిల్పకళారమణీయంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News