Tuesday, April 30, 2024

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరనున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాజాగా దీనిపై రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ స్పందించారు. రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతున్నారని దీనిపై త్వరలోనే డేట్ ఖరారు అవుతుందని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అంశం ఎన్నికల సంఘం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డే కాకుండా రానున్న రోజుల్లో చాలా మంది బిజెపిలో చేరబోతున్నారని వెల్లడించారు. అటు బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ సైతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికను స్వాగతించారు. ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి ఎవరు బిజెపిలోకి వచ్చినా వారిని గెలిపించుకుంటామని ఈటల పేర్కొన్నారు.

కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై ముఖ్య అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. నియోకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాలకర చెందిన నాయకుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. .వారం రోజుల్లో తమ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారని సమాచారం. పార్టీ మార్పుతో పాటు ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయం చెప్పాలని ముఖ్యనేతలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచిస్తున్నట్టుగా సమాచారం. వారం లోపుగా అభిప్రాయాలు చెప్పాలని నేతలకు సూచించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని ఈ నెల 24న ఆయన అన్నారు. ఈ విషయమై రాజగోపాల్ రెడ్డితో సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా అదే రోజున చర్చలు జరిపారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి బిజెపికే ఉందనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా కూడా చెప్పారు. జిహెచ్‌ఎంసి, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు.

Rajagopal Reddy to Join BJP Soon: Bandi Sanjay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News