Thursday, May 2, 2024

కుటుంబం ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడిన వ్యక్తి ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నాడు, ఈ క్రమంలో కూల్ డ్రింక్‌లో భార్య, కుమారుడికి విషం ఇచ్చి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రామంతాపూర్‌కు చెందిన ఆనంద్(45), మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిర(28)ను రెండో వివాహం చేసుకున్నాడు. దంపతులు గత మూడు సంవత్సరాల నుంచి బండ్లగూడలోని జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులు మూడేళ్ల కుమారుడు విక్కీ ఉన్నాడు. ఇందిర ప్రైవేటు జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా ఆనంద్ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం పాల వ్యాపారం మానేసి ఖాళీగా ఉండడంతో ఆన్‌లైన్ గేములకు అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్ డబ్బులు పెట్టి గేమ్‌లు ఆడుతుండడంతో డబ్బులు పొగొట్టుకునేవాడు.

అప్పులు చేయడంతో వాటిని తీర్చడానికి భార్యపై ఉన్న బంగారాన్ని కూడా అమ్మేశాడు. అప్పులు ఎక్కువ కావడంతో ప్లాట్‌ను అమ్మాలని నిర్ణయం తీసుకోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. బంధువులు, ఇరువైపుల కుటుంబ సభ్యులు దంపతులకు సర్ది చెప్పారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇందరి సోదరి ఆనంద్‌కు ఫోన్ చేసి తన గ్రామానికి రావాల్సిందిగా సూచించింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి భార్య, కుమారుడికి ఇచ్చి చంపేశాడు. అనంతరం తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు తన తోడల్లుడికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని సరికి ముగ్గురు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ గేమ్‌లతో ఆర్థిక ఇబ్బందులు రావడంతో వారు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News