Tuesday, April 30, 2024

ఆగ్రహంగా భీమ్… గర్జించిన అల్లూరి

- Advertisement -
- Advertisement -

Ram Charan and Jr NTR poster release from RRR

 

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్ర ఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులు, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈనెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక సోమవారం ఉదయం కొమురం భీమ్ పోస్టర్‌ను విడుదల చేయగా పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ ఆగ్రహంగా దర్శనమిచ్చాడు. అయితే సోమవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్‌లో రామ్‌చరణ్ గర్జిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండు పోస్టర్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News