Thursday, May 2, 2024

రమ్నా కాళీ ఆలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

Ramnath kovind visit ramna kali mandir in Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో 1971 యుద్ధ సమయంలో ధ్వంసమైన రమ్నా కాళీ ఆలయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ప్రారంభించారు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయడంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం ఢాకాలో 250 మంది హిందువులను ఊచకోత కోశారు. పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సెర్చ్ లైట్‌లో భాగంగా హిందువులను అతి కిరాతకంగా హత్య చేశారు. 600 ఏళ్ల క్రితం నాటి ఆల‌యంపై 1971 మార్చి 27లో పాక్ ఆర్మీ దాడి చేసింది. ఆ ఆల‌యంలో ఉన్న ప్ర‌ధాన పూజారిని చంపేశారు. 2017లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆలయాన్ని దర్శించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ గుడి పునర్ నిర్మాణం చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News