Thursday, August 7, 2025

రషీద్ ఖాన్ నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

టి20 ఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త రికార్డును సృష్టించాడు. టి20 ఫార్మాట్‌లో 650 వికెట్లను పడగొట్టిన తొలి బౌలర్‌గా రషీద్ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో రషీద్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ టోర్నీలో రషీద్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లండన్ స్పిరిట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచి 11 పరుగులకే మూడు వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ 15 డాట్ బాల్స్ వేశాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లను తీసిన రషీద్ టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు 478 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఏకంగా 651 వికెట్లను పడగొట్టాడు. దీంతో టి20లలో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్‌గా రషీద్ రికార్డు నెలకొల్పాడు. డ్వేన్ బ్రావో (విండీస్) 631 వికెట్లతో రెండో, సునీల్ నరైన్ (విండీస్) 589 వికెట్లతో మూడో, ఇమ్రాన్ తహీర్ (సౌతాఫ్రికా) 547 వికెట్లతో నాలుగో, షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) 498 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News