Sunday, April 28, 2024

3000కోట్లు

- Advertisement -
- Advertisement -

బాండ్ల వేలానికి ఆర్‌బిఐ అనుమతి

రూ.3వేల కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం
తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు గ్రీన్
గతంలో బాండ్ల వేలానికి నిరాకరించిన ఆర్‌బిఐ ఈ వివక్షను
జాతీయస్థాయిలో ఎండగట్టిన కెసిఆర్ తప్పు సరిదిద్దుకున్న

మన తెలంగాణ / హైదరాబాద్ :తెలంగాణ రైతన్నల అదృష్టమో&లేక తెలంగాణ ప్రభుత్వ సంకల్ప బలమోగానీ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ బాండ్ల వేలానికి అనుమతులను మంజూరు చేసింది. మూడు వేల కోట్ల రూ పాయల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్లను ఈ నెల 28వ తేదీన వేలం వేయడానికి ఆర్‌బిఐ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రా సింది. ఈ మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఈనెల 28వ తేదీ సాయంత్రానికి తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో జమ అవుతాయి. అదే రోజు నుంచి రైతన్నలకు రైతుబంధు పథకం కింద నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ 7న జరిగిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నాలుగు వేల కోట్ల రూపాయలను ఆర్‌బిఐ విడుదల చేసిందని, ఈనెల 28వ తేదీన రానున్న మూడు వేల కోట్ల రూపాయల నిధులను కలుపుకుంటే రైతు బంధు పథకానికి అవసరమైన రూ.7,500 కోట్లలో ఏడు వేల కోట్ల రూపాయ లు బాండ్ల వేలంలోనే వస్తున్నాయని, మిగతా రూ.500 కోట్ల్లు సొంత ఆదాయం నుంచి వినియోగిస్తామని, దీంతో రైతుబంధు పథకానికి అవసరమైన నిధులకు ఢోకా లేదని ఆర్థిక ర్కొంది.

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతన్నలకు ఇచ్చి న హామీని నెరవేరుస్తున్నందుకు తమకు కూడా సంతోషంగానే ఉందని పేర్కొంటు న్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలంలో 12 ఏళ్ల కాలపరిమితికి వెయ్యి కోట్లు, 13 ఏళ్ల కాలపరిమితికి మరో వెయ్యి కోట్లు, 14 ఏళ్ల కాలపరిమితికి ఇం కో వెయ్యి కోట్ల రూపాయల లెక్కన అప్పు తీసుకోవడానికి ఆర్‌బిఐ మంజూరు చే సింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మూడు వేల కోట్ల రూపాయలను అప్పు గా చ్చింది. అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాలకు వెయ్యి కో ట్లు, గుజరాత్ రాష్ట్రానికి వెయ్యి కోట్ల అప్పుకు అనుమతులు ఇస్తూనే అదనంగా అప్పు చేసుకోవాలంటే మరో రూ. 500 కోట్లను కూడా పెంచుకునే వెసులుబాటును కల్పించింది ఆర్‌బిఐ హ ర్యానా రాష్ట్రానికి రూ.4వేల కోట్లు, మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తలా రూ.2వేల కోట్లను అప్పుగా తీసుకోవడానికి అనుమతులు ఇస్తూ ఆర్‌బిఐ జారీ చేసింది. మొత్తం 9 రాష్ట్రాలు కలిపి ఈనెల 28వ తేదీన 19 వేల కోట్ల రూపాయలను అప్పులుగా నిధులను సేకరించుకునేందుకు సెక్యూరిటీ బాండ్లకు వేలం వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ నిర్వహణకు ప్రతి నెలా సగటున సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందులో ఖజానా కు సొంత ఆదాయం సుమారు రూ.12 వేల కోట్ల వరకు వస్తుందని, మిగతా నాలుగు వేల కోట్ల రూపాయల లోటును సెక్యూరిటీ బాండ్ల వేలం లో పాల్గొని అప్పుల రూపంలో సమకూర్చుకొంటున్నామని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అయితే ఈనెలలోనే సెక్యూరిటీ బాండ్లలో వేలంలో పాల్గొనడం మూలంగా మొత్తం కలిపి ఏడు వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకొన్నట్లవుతుందని, దాంతో నెలావారీ ఖర్చులు 16 వేల కోట్ల రూపాయలకు బదులుగా 19 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా భావించాలని, అందుకే రైతు బంధు పథకానికి నిధులకు ఎలాంటి ఢోకాలేదని, అందుకే ఎంతో ఊరటగా ఉందని అంటున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్, మే నెలల్లో రొటీన్‌గా ఆర్.బి.ఐ.వేలం నుంచి రావాల్సిన సుమారు పది వేల కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని, ఆ నష్టాన్ని భర్తీ చేయాలని తాము ఆర్.బి.ఐ.ని పదేపదే కోరుతూ వచ్చామని వివరించారు.

పైగా తెలంగాణ రాష్ట్రం పట్ల ఆర్.బి.ఐ. ఏప్రిల్, మే నెలల్లో వ్యవహరించిన తీరుతెన్నులు జాతీయస్థాయిలో తీవ్ర చర్చకు దారి తీయడం, ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కేంద్రప్రభుత్వ పనితీరును దేశవ్యాప్తంగా ఎండగట్టడంతో దాదాపు అన్ని రాష్ట్రాలూ తెలంగాణకు సపోర్టు చేయడం కూడా బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఆర్.బి.ఐ.కూడా తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అనేక అంశాల్లో తన లోపాలను గుర్తించినట్లుగా ఉందని, పైకి అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఆర్.బి.ఐ.ఉన్నతాధికారుల వ్యవహారశైలిని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం తమను దోషిగా నిలబెట్టిందని, జరిగిన తప్పులను సరిదిద్దుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు. తాము కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఆర్.బి.ఐ. స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు, వాటిని కేటాయించిన బడ్జెట్, నిధులను ఖర్చు చేస్తున్న విధానాలను అన్నింటినీ ఆర్.బి.ఐ. ముందుంచుతున్నామని, దాంతో తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి లోపాలను ఎత్తిచూపడానికి ఆర్.బి.ఐ.కు ఆస్కారం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకొన్నామని, అందుకే నిధులను సమకూర్చుకోగలుగుతున్నామని ఆ అధికారులు ధీమా వ్యక్తంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News