Friday, May 3, 2024

నాగచైతన్య అదరగొట్టేశాడు

- Advertisement -
- Advertisement -

Release of first look at Naga Chaitanya's character

 

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా ‘మనం’. ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. మంగళవారం నాగచైతన్య బర్త్ డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. కానీ అంతకంటే ముందుగానే సోమవారం నాగచైతన్య పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

చేతిలో కర్ర పట్టుకొని చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్‌లెట్… ఇలా అన్నీ చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. ఈ ఫస్ట్ లుక్‌తో నాగచైతన్య అదరగొట్టేశాడు. రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైసూర్‌లో ప్రస్తుతం ‘బంగార్రాజు’ షూటింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News