Tuesday, April 30, 2024

స్పెషల్ ట్రీట్

- Advertisement -
- Advertisement -

Release of Ramcharan, NTR's stills

 

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్‌డేట్‌లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల సోలో స్టిల్స్‌ని విడుదల చేశారు. ఈ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News