Friday, May 3, 2024

జియో నుంచి ఎమర్జెన్సీ డేటా లోన్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో శనివారం ఓ సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. వినియోగదారులు పని మధ్యలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండడానికి, డేటా కొరత రాకుండా చూడడానికి ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ప్రీపెయిడ్ వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ శనివారం తెలిపింది. ఎమర్జెన్సీ లోన్ ఫీచర్‌కింద వినియోగదారులు ముందుగా డేటా లోన్ తీసుకొని ఆ తర్వాత చెల్లించవచ్చు. ప్రతి ఒక్కరూ ఐదు డేటా రీచార్జి ప్యాక్‌ల వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రతి ప్యాక్‌తో 1జిబి డేటా లభిస్తుంది. అందుకు రూ.11చెల్లించాల్సి ఉంటుంది. లోన్ వాడుకోవాలంటే అప్పటికే వ్యవధి ముగియని ప్లాన్ ఉండాలి.ఆ బేస్ ప్లాన్ చెల్లుబాటు అయ్యేవరకు లోన్ తీసుకున్న డేటాను వినియోగించుకోవచ్చు. డేటా లోన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే మై జియో యాప్‌లోని మెనూ బటన్‌లో ‘ఎమర్జెన్సీ డేటాలోన్’ను ఎంచుకోవాలి. ‘ప్రొసీడ్’ బటన్‌ను క్లిక్ చేయగానే ఐదు 1జిబి ఎమర్జెన్సీ డేటా ప్యాక్‌లు కనిపిస్తాయి. ఇక్కడ ‘గెట్ ఎమర్జెన్సీ డేటా’ను క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి. ఇలా ఐదుసార్లు డేటా లోన్‌ను పొందే అవకాశాన్ని జియో కలిస్త్తోంది.

Reliance launched Jio Emergency data loan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News