Friday, April 26, 2024

సర్కార్ బడుల వైపు విద్యార్థులు మొగ్గు….

- Advertisement -
- Advertisement -

Students joined in Government schools

ఫీజుల వేధింపులతో కార్పొరేట్ స్కూళ్లకు దూరం
వేలకు వేలు ఫీజులు చెల్లించిన ఆన్‌లైన్ తరగతులే
దూరదర్శన్, టీశాట్‌లో అర్దవంతంగా డిజిటల్ పాఠాలు
ప్రైవేటులో అర్దంకానీ ఆన్‌లైన్ తరగతుల బోధన
మూడు రోజుల్లో 1500మంది విద్యార్దులు చేరిక

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో ప్రైవేటు విద్యాసంస్దల ఫీజుల వేధింపులు భరించలేక చాలామంది విద్యార్దులు సర్కార్ బడిబాట పడుతున్నారు. ఎక్కడ చదివిన ఆన్‌లైన్ తరగతులే కార్పొరేట్ స్కూల్‌కు వెళ్లి వేలకు వేలు ఫీజులు ఎందుకు చెల్లించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలు గురుకుల పాఠశాలల్లో చేరుతూ చదువులు కొనసాగిస్తున్నారు. జూలై 1వ తేదీన స్కూల్ ప్రారంభించి విద్యార్దులకు డిజిటల్ పాఠాలు బోధించాలని విద్యాశాఖ సూచించడంతో ఆదిశగా ప్రైవేటు యాజమాన్యాలు స్కూల్ తెరిచి 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్దులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

కానీ విద్యార్దులు గత విద్యాసంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజులతో పాటు ఇతరులు ఏడాదికి రూ. 35వేల నుంచి రూ. 80వేల వరకు చెల్లించాలని హెచ్చరించడంతో తల్లిదండ్రులు అంత మొత్తంలో కట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్‌తో ఆర్దికంగా సమస్యలు ఎదుర్కొనడంతో మళ్లీ చిన్నారులు ఫీజులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందుతూ పిల్లలకు సమీపంలో ఉన్న సర్కార్ స్కూల్‌కు పంపుతున్నారు.

అయితే అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.సి. తీసుకురావాలని సూచించడంతో పేద విద్యార్దుల తల్లిదండ్రులు ప్రైవేటు వెళ్లి వేల రూపాయలు బకాయిలు చెల్లించలేక, టి.సిలు తీసుకరాలేక స్దానికంగా ఉండే కార్పొరేటర్లు ఆశ్రయిస్తూ ప్రభుత్వ బడిలో మా పిల్లలు చేరేలా చూడాలని కోరుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 690 ప్రాథమిక, ఉన్నత పాఠశాలుండగా 99035 మంది విద్యార్దులు విద్యనభ్యసిస్తున్నారు. ఈవిద్యాసంవత్సరం మరో 20శాతం విద్యార్దులు సంఖ్య పెరిగే అవకాశముందని జిల్లా విద్యాశాఖ భావిస్తుంది. స్కూల్ ప్రారంభమై మూడు రోజులు గడిచిన ఇప్పటివరకు 1500మంది విద్యార్దులు చేరినట్లు ఎక్కువగా సైదాబాద్, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, మెహిదిపట్నం, ముషీరాబాద్, అంబర్‌పేట, తిరుమలగిరి, ఖైరతాబాద్, షేక్‌పేట ఏరియాల్లో ఉన్న స్కూల్‌కు ఆదరణ పెరుగుతున్నట్లు పాఠశాలల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ప్రభుత్వ స్కూల్ వెళ్లితే ఆన్‌లైన్ తరగతులు దూరదర్శన్, టీశాట్ ద్వారా వినే అవకాశముందని, ప్రైవేటు స్కూల్‌కు వెళ్లితే ఖచ్చితంగా సెల్‌ఫోన్ తీసుకుని ట్యూషన్ ఫీజు చెల్లిస్తే ప్రత్యేక యాప్‌ను వేసి పాఠాలు బోధిస్తున్నారు. పాఠాలు కూడా ఇతర స్కూళ్లకు చెందిన టీచర్ల కావడంతో విద్యార్దులకు సక్రమంగా అర్దంకాక ప్రైవేటు వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ బడుల్లో ట్రాన్స్‌ఫర్ సర్టిపికేట్ లేకుండా 8వ తరగతి వరకు ఆడ్మిషన్ తీసుకునేలా చూడాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News