Friday, May 3, 2024

ఘాజీపూర్ బార్డర్‌లో బారికేడ్లు తొలగింపు

- Advertisement -
- Advertisement -

Barricades removal
తిక్రీ: హర్యానా, ఢీల్లీని కలిపే రహదారిలో వాహనాల రాకపోకలు పునరుద్ధరించేందుకుగాను రైతులు సేద్యపు చట్టాలకు విరుద్ధంగా ఆందోళన చేస్తున్న ఘాజీపూర్ బార్డర్‌లో నాటిన బారికేడ్లను పోలీసులు శుక్రవారం తొలగించారు. క్రేన్ల సాయంతో కాంక్రీట్ బారికేడ్లు, ఇనుప బారికేడ్లను కూడా తొలగిస్తున్నట్లు సమాచారం. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక పోలీస్ కమిషనర్ (నార్త్ జోన్) దీపేంద్ర పాఠక్ సహా అనేక మంది సీనియర్ నాయకులు ఘాజీపూర్ బార్డర్‌ను సందర్శించనున్నారని సమాచారం.
వారం కిందట రోడ్లను దిగ్బంధించుతున్నారన్న కారణంగా ఘాజీపూర్ బార్డర్‌లో రైతుల గుడారాలను బలవంతంగా తొలగించారు. దాంతో భారతీయ కిసాన్ నాయకుడు రాకేశ్ టికైత్, మరికొంత మంది రైతులు రోడ్లను బ్లాకేడ్ చేస్తున్నది రైతులు కాదు; పోలీసులే బ్లాకేడ్ చేస్తున్నారని నిరసన తెలుపుతూ బారికేడ్‌లపై పెయింట్‌తో ‘మోడీ సర్కార్’ అని రాయడం సోషల్ మీడియాలో వైరల్ అయిందన్నది తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు సైతం రైతులు నిరసన తెలుపుకోవచ్చే తప్ప, రోడ్లు దిగ్భందించకూడదని ఇటీవల వ్యాఖ్యానించింది. తిక్రీ బార్డర్‌లో గురువారం లారీ ఢీకొట్టగా ముగ్గురు మహిళా రైతులు మరణించడం, ఇద్దరు గాయపడ్డంతో ఢిల్లీ పోలీసులు బారికేడ్లను తొలగించేపనిలో పడ్డారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News