Sunday, December 15, 2024

రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ నాయకత్వం తమకు స్ఫూర్తినిస్తుందని, ప్రజలకు సేవ చేయడంతో మరింత బలం, విజయం దక్కాలని ఆకాంక్షించారు. ఎన్నో విజయాలు సాధించాలని తన ట్విట్టర్‌లో సీతక్క వీడియో పోస్టు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్బూ తమ తమ ట్విట్టర్లలో రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి యాదాద్రి చేరుకున్నారు. ఆయన ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని చిరు ఆకాంక్షించారు. యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సిఎం సమావేశం కానున్నారు. మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్రను సంగెం నుంచి రేవంత్ ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News