Thursday, May 2, 2024

కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ పరధిలో రెండు రోజుల్లో బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని 674 రేషన్ దుకాణాల ద్వారా 5.80 లక్షల తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. కార్డుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఒకేసారి పెద్ద ఎత్తున రేషన్ దుకాణాల వద్దకు వస్తే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని సూచించారు. కరోనా నేపథ్యంలో గుంపులు గుంపులుగా రావద్దన్నారు. 21.77 లక్షల మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున 26,377 మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 67 దుకాణాల ద్వారా, 3వ తేదీనుంచి 240 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 17వేల కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశామని మంత్రి తలసాని తెలిపారు.

Rice distribute within 2 days in Hyderabad: Talasani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News