Sunday, April 28, 2024

రైఫిల్ రెడ్డి.. కిషన్ రెడ్డి కెసిఆర్ కు పోటీనా?

- Advertisement -
- Advertisement -

ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్, స్వరాష్ట్రం కోసం రాజీనామా చేయడానికి
భయపడి పారిపోయిన కిషన్ రెడ్డి.. వీళ్లా కెసిఆర్‌కు సరితూగేది?

మన తెలంగా/హైదరాబాద్: రైఫిల్ రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డిలు తెలంగాణ ఉద్యమ నేత కెసిఆర్‌కు పోటీనా అని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ సమయంలో రైతులపై రైఫిల్ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి, అదే సమయంలో ఉద్యమంలో పాల్గొనకుండా అమెరికాకు వెళ్లిన కిషన్‌రెడ్డిలు నేడు ఎన్నికల సమయంలో తగుదునమ్మా అంటూ కెసిఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించడంపై మండిపడ్డారు. కెసిఆర్ అవినీతి పరుడు అని రాహుల్ అంటున్నడు. మరి రాహుల్ పక్కన ఉన్నది ఎవరు? అని ప్రశ్నించారు. ‘ఆనాడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు రేటు. .. రేపు రాష్ట్రమంతా అమ్ముతడు. బిజెపికి కాంగ్రెస్ పార్టీని అమ్మిపారేస్తాడు. అలాంటి వ్య క్తిని పక్కన కూర్చొడెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు.

పిసిసి అధ్యక్షుడే పైసలు పంచుకుంటూ దొరికపోయిన దగుల్బాజీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.50 కోట్లు మీ ఇంఛార్జీకి లంచం ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్న దొంగ రేవత్. ఇది వాస్తవమో కాదో తెలుసుకోవాలంటే, మీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పక్కకు పిలిచి అడిగినా చెప్తడు. ఇక్కడ సీట్లు ఎక్కడ అమ్ముతున్నడు. ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నడు. ఎక్కడ ప్లాట్లు రాయించు కుంటున్నడు. కొద్దిగా ఎంక్వైరీ చేయించుకో రాహుల్‌గాంధీ. ఓ పది మంది కాంగ్రెస్ నాయకులకు పక్కకు తీసుకెళ్లి మాట్లాడి వాస్తవాలు తెలుసుకో. నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడు రేవంత్ బండారం బయటపడ్తది. దొంగను పక్కన కూర్చొబెట్టుకుని మాట్లాడుతుంటే.. గురివింద గింజ తన నలుపు ఎరుగదు అన్నట్లు ఉన్నది కథ’ అని కెటిఆర్ విమర్శించారు.

రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతది?
కెసిఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాహుల్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కాళేళ్వరం ప్రా జెక్టును రూ.80 వేల కోట్లతో నిర్మించారని, 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతది అని ప్రశ్నించారు. అమెరికాలో ఉండే ‘ప్రపంచ పర్యావరణ కాంగ్రెస్ వాళ్లు పిలిచి కాళేశ్వరానికి అవార్డులు ఇస్తున్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెసోళ్లకు అయితే అర్థమైత లేదు. 80 వేల కో ట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతది. కొంచెం బుర్రతో ఆలోచించి మాట్లాడాలి. రాహుల్‌గాంధీతో వచ్చిన బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే అది చదువుతాడు పాపం. ఆయనకేం తెల్వదు. తెల్లకాగితం. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడ’ని రాహుల్‌పై కెటిఆర్ మండిపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాం ధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో కుటుంబ పాలన గురిం చి మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. కెసిఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్న రాహుల్ గాంధీ ఎవ రు? అని ప్రశ్నించారు. ‘ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద నిలబడొచ్చు. సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. అప్పుడప్పుడు చనిపోయిన ఇందిరా గాంధీ ని, రాజీవ్ గాంధీని, నెహ్రూని యాది చేసుకోవచ్చు. కాని కెసిఆర్‌ది మాత్రం కుటుంబ పాలన అంటారు. ఇదెక్కడి నీతి నాకర్థం కాదు. గొంగడిలో కూర్చొని ఎవడన్న వెంట్రుకలు ఏరుతాడా?’ అని కెటిఆర్ ప్రశ్నించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News