సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ ఓసీ సింగరేణి ఉద్యోగుల సౌకర్యార్థం నిర్మించిన పీవీఆర్ రావు సెంటినరీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడు రోజులు సెలవు దినాలు ఉండడంతో ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆరు క్వార్టర్స్‌లో దొంగలు భారీగా సొత్తు చోరీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు క్వార్టర్స్ చోరీకి గురైన వస్తువులను గుర్తించగా మిగిలిన ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో వారికి పోలీసులు సమాచారం అందించారు. అశోక్ క్వార్టర్స్‌లో రూ.30 వేల నగదు, 40-50 తులాల వెండి, 3 తులాల బంగారం, ఓ మొబైల్ ఫోన్, అఖిల్ క్వార్టర్స్‌లో 3 తులాల బంగారం, రూ. 8 వేలు నగదు చోరీకి గురైనట్లు సమాచారం. సత్తుపల్లి పట్టణ సీఐ టి.శ్రీహరి క్లూస్ టీం, డాగ్స్ క్యాడ్ రప్పించి కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా వరుస చోరీలతో సింగరేణి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సత్తుపల్లిలో దొంగల బీభత్సం
- Advertisement -
- Advertisement -
- Advertisement -