Thursday, July 31, 2025

జిఎస్‌టి మోసం గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీస్థాయిలో జీఎస్టీ మోసం బట్టబయలు -అయ్యిం ది. సుమారుగా రూ.100 కోట్ల పైచిలుకు నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కాం బయటపడింది. రాష్ట్ర వా ణిజ్య పన్నుల శాఖ అధికారులు భారీ స్థాయిలో జీఎస్టీ మోసాన్ని పసిగట్టి హైదరాబాద్‌కు చెం దిన కేశాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పిపై సోదాలు ని ర్వహించి ఈ మోసాన్ని బయటపెట్టారు. కచ్చితమైన సమాచారంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కేశాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పి ప్రధాన కార్యాలయం (ఎస్‌పి రోడ్డు), బన్సీలాల్‌పేట్‌లోని కంపెనీ గోదాం, మెదక్ జిల్లా కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని ఫ్యాక్టరీలపై తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అధికారుల తనిఖీల్లో కేశాన్ ఇండస్ట్రీస్ సంస్థ సరుకు రవాణా లేకుండానే రూ.100 కోట్లకు పైగా విలువైన నకిలీ ఇన్‌వాయిస్‌లు జారీ చేసి, మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఖాళీ వాహనాలను మహారాష్ట్రకు పంపించి, సరుకు రవాణా జరిగినట్లుగా డాక్యుమెంటేషన్ చేసినట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో తేలింది.

ఇప్పటికే ఐటసి క్లెయిమ్‌ల ద్వారా రూ.33.20 కోట్లు స్వాహా
వాహనాల చలాన్‌లకు సంబంధించి టోల్ గేట్ డేటాను (ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా) అధికారులు విశ్లేషించడంతో అనేక వాహనాలు సరుకులు లేకుండానే టోల్ పాయింట్లను దాటినట్లు బయటపడింది. ఈ ప్రక్రియ ద్వారా కేశాన్ ఇండస్ట్రీస్ సంస్థ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)లను క్లైయిమ్ చేసి రూ.33.20 కోట్లు అక్రమంగా ప్రభుత్వం నుంచి పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రిజిస్ట్రర్లు, హార్డ్ డిస్క్‌లను, సిసిటివి ఫుటేజీలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ డైరెక్టర్లు వికాష్ కుమార్ కేశాన్, రాజనేశ్ కేశాన్‌లపై సెంట్రల్ క్రైం స్టేషన్ (సిసిఎస్), హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.

మరో కేసులో వాహనం జప్తు
ఇక మరో కేసులో మెహిదీపట్నం-1 సర్కిల్ ఆధ్వర్యంలో ఎపి 29 టిఏ 7213 వాహనాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జప్తు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అధికారుల విచారణలో ఆ వాహనం నెంబర్‌తో అనేక తప్పుడు ఈ- వే బిల్లులు జారీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇది సిజిఎస్టీ చట్టం, 2017కు విరుద్ధంగా ఉందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు. బిఎన్‌ఎస్ సెక్షన్లు 318, 336 ప్రకారం ఇది క్రిమినల్ ఉద్దేశంతో చేసిన మోసంగా అధికారులు తెలిపారు. వాహన యజమానిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను తప్పించుకునే ఎలాంటి అక్రమ ప్రయత్నాలనైనా అరికట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ చర్యలు తీసుకుంటుందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత, తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News