Friday, May 3, 2024

రైతుబంధు ఖాతాలకు రూ.1152కోట్లు జమ

- Advertisement -
- Advertisement -

Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

మనతెలంగాణ/హైదరాబాద్: వానాకాలం పంటల సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతుబంధు పథకం కింద బుధవారం రూ.1152.46కోట్లు రైతుల ఖాతాకు జమ చేసింది. రెండెకరాల వరకూ పొలం ఉన్న 15.07లక్షల మంది రైతులకు నగదు పంపిణీ జరిగింది.దీంతో రెండు రోజుల్లో మొత్తం రూ.1669.42కోట్లు రైతుల ఖాతాలకు చేరిపోయాయి. గురువారం నాడు మూడు ఎకరాల విస్తీర్ణం వరకూ పొలం ఉన్న 10.40లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం నగదు పంపిణీ జరగనుంది. బ్యాంకుల్లో రూ1272.85కోట్లు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో రైతుబంధు నగదు సాయం పంపిణీ ప్రారభం ద్వారా మూడు రోజల్లోనే రాష్ట్రంలో మొత్తం 42.43లక్షల మంది రైతులకు నగదు సాయం అందనుంది. మొత్తం 58.85లక్షల ఎకరాలకుగాను రూ.2942.27కోట్లు బ్యాంకుల్లో జమ కానుంది.

మూడవ రోజు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 79,727మంది రైతుల ఖాతాలకు రూ.98.29కోట్లు జమ చేయనున్నారు. అత్యల్పంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 3701మంది రైతులకు రూ.4.45కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 25నాటికి రాష్ట్రంలోని రైతుబంధం పథకానికి అర్హతగల రైతులందరి ఖాతాలకు రూ.7508.78కోట్లు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ సారి రాష్ట్రంలో పత్తి, కంది పంటల సాగు పెంచాలని లక్షంగా పెట్టుకున్నామన్నారు. పప్పుదినుసులు, నూనె గింజల పంటల సాగును కూడ ప్రోత్సహిస్తున్నామన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంల వైపు దృష్టి సారించాలని మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు.

Rs 1152 cr Rythu bandhu deposited in farmers accounts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News