Friday, May 3, 2024

రికార్డుల పంట

- Advertisement -
- Advertisement -

2.62కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తితో జాతీయస్థాయిలో రెండో స్థానం 
28.8లక్షల మెట్రిక్ టన్నుల మక్కల దిగుబడితో మూడోస్థానం 
దేశవ్యాప్తంగా రూ.32కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారోత్పత్తుల దిగుబడి
మనతెలంగాణ/హైదరాబాద్: ఒక వైపు వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం సరైన సహాకారం అందించకుండా నల్లచట్టాలతో అణచివేతకు పాల్పడుతుందన్న విమర్శలు.. మరో వైపు మోడి సర్కారు రైతు వ్యతిరేక విధానాల పట్ల ఎగిసి పడుతున్న ఉద్యమాలు.. స్వామినాధన్ కమీకమిటి సిఫార్సులు, మెరుగైన పంటల బీమా పథకాలు అమలు చేయాలన్న డిమాండ్ల మధ్య పంటల సాగు ఉత్పత్తుల పెంపుదలలో రెట్టించిన ఉత్సాహంతో చెమటోడ్చి రైతులు తమ సత్తా చాటుకుని ప్రపంచ దేశాల ముందు భారత్ సగౌరవంగా తలెత్తుకునేలా చేశారు.దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 32.35కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారోత్పత్తుల దిగుబడితో సరికొత్త రికార్డును సృష్టించారు. ఇంతటి అరుదైన రికార్డును సాధించటంలో తెలంగాణ రైతు తనవంతు భుజం కాసి ఆహారోత్పత్తుల దిగుబడిలో కీలక భూమిక పోషించారు.

దేశంలో అన్ని ప్రధాన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర ఆహారోత్పుల దిగుబడులు 202223 సంవత్సరానికి సంబంధించి 32.35కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగినట్టు కేంద్ర అర్ధగణాంక శాఖ వెల్లడించింది. 202122లో అన్ని రకాల ఆహర పంటల దిగుబడి 31.56కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, ఈ ఏడాది 79లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా పండించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎరువులపై సబ్సిడీలను తగ్గించింది. విత్తన ధరల పెంపుదలలో ప్రైవేటు విత్తన కంపెనీలకు వంత పాడింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పధకంలో రైతుల సంఖ్యను కుదించి నిధులకు కోతలు పెట్టింది. వ్యవసాయరంగానికి డీజిల్ సబ్సిడీ ఎత్తివేసింది.సేద్యం మొదలుకుని వ్యవసాయ ఉత్పత్తుల రవాణ వరకూ యంత్రాలకు ఉపయోగించే పెట్రోల్ డీజిల్‌పై భారీగా పన్నులు వేసి ధరల మంట పుట్టించింది.

పంటలకు కనీస మద్దతు ధరలు రెట్టింపు పెంచాలని సూచించిన స్వామినాధన్ కమిటి నివేదికను చెత్తబుట్ట పాలు చేసింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి లింకు చేయాలన్న దిడిమాండ్లను బేకాతరుచేసింది.కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో రైతుకు తగిన సహాకారం అందింటం లేదని జాతీయ స్థాయిలో రైతు సంఘాలు ఘోసిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రైతులు ఏ మాత్రం మనోధైర్యం కోల్పోకుండా పంటల సాగులో తమ రక్తాన్నే చెమటగా మార్చి రికార్డు స్థాయిలో పంటల దిగుబడి సాధించి దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసి ప్రశంసలందుకుంటున్నారు.202223 సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో 32.80కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా పెట్టుకోగా, రైతులు కేంద్రం అంచనాలను అందుకున్నారు.

బియ్యం దిగుబడిలో భుజం కాసిన తెలంగాణ
ఈ ఏడాది ఆహారోత్పత్తుల దిగుబడిలో ప్రత్యేకించి బియ్యం ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి లక్ష్యాల సాధనలో భుజం కాసింది. దేశమంతటా ఖరీఫ్, రబీ సిజన్లకు కలిపి మొత్తం 13కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుబడిని సాధించగా , ఇందులో ఒక్క తెలంగాణ రా్రష్ట్రం నుండే 262లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. గత ఏడాది జాతీయ స్థాయిలో 12.94కోట్ల టన్నుల బియ్యం దిగుబడిని సాధ్యపడగా, ఈ ఏడాది అంతకంటే అధికంగానే దిగుబడులు సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. మొక్కజొన్న పంట దిగుబడిలో కూడా తెలంగాణ రా్రష్ట్రం 28.8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది.

పప్పు ధాన్యాల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో ఒక్క పప్పుశనగల ఉత్పత్తిలో తప్ప మిగిలిని వాటిలో గత ఏడాది ఉత్పత్తితో పొలిస్తే ఈ ఏడాది కొంత తగ్గింది. ఈ ఏడాది పప్పుధాన్య పంటల దిగుబడి 2.95 కోట్ల టన్నులు అంచనా వేయగా, అందులో 17లక్షల టన్నుల మేరకు తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కంది పంట 1.83 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లభించింది. రాష్ట్రంలో ఈ సారి జొన్న పంట 0.80లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లభించింది. 2023 సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఎంతో ఆర్బాటంగా ప్రకటించినప్పటికీ రైతులకు ఈ పంట సాగులో ఏమాత్రం ప్రొత్సాహం ఇవ్వక పోవటం, కనీసం రాగి, సజ్జ, కొర్ర తదితర పంటలకు కనీస మద్దతు ధరలు కూడా ప్రకటించకపోవటం, చిరుధాన్యాల మార్కెట్ విధానాల అమలు గురించి పట్టించుకోకపోవటంతో రైతులు చిరుధాన్య పంటల సాగు పట్ల అంతగా ఆసక్తి చూపలేదు.

తగ్గిన నూనెగింజల ఉత్పత్తి
దేశీయంగా ఈ ఏడాది నూనెగింజల ఉత్పత్తి తగ్గింది. జాతీయ స్థాయిలో 4.13కోట్ల టన్నుల నూనెగింజల దిగబడిని అంచనా వేయగా, దిగుబడి లక్ష్యాలకు 13కోట్ల టన్నుల వద్దే బ్రేకులు పడ్డాయి. అందులో వేరుశనగ 1.04 కోట్ల టన్నులకు గాను ఉత్పత్తి కోటి టన్నులకే పరిమితం అయింది. పొద్దుతిరుగుడు గింజలు 2.79 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వద్దనే ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వేరుశనగ పంట దిగుబడి 2.50లక్షల మెట్రిక్ టన్నులు కాగా ,సోయాబీన్ 3.27లక్షల టన్నుల దిగుబడి సాధ్య పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News