Tuesday, May 7, 2024

ప్రభుత్వ ఆదాయానికి పన్నుపోటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఆదాయపు శాఖ పన్ను రిఫండ్ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం వెలుగులోకి తెచ్చారు. ఐటీ రిఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటి అధికారుల సోదాల్లో బయట పడింది. ఈ కుంభకోణం వెనుక 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్స్‌తో పాటు రైల్వే, పోలీస్ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్రను గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటి కంపెనీలలో అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, వనస్థలి పురం, నిజాంపేటలోని ఐటి కన్సల్టెంట్స్‌లో సోదాలు చేశారు.

ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసి విచారణ జరపనున్నారు. ఏజెంట్ల రిఫండ్ మొత్తంపై పది శాతం కమీషన్ కోసం ఐటి కన్సల్టెంట్లు తప్పుడు రిటరన్స్ దాఖలు చేసి, ఆ తర్వాత రిఫండ్ పొందేందుకు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారని తెలింది. 2017లో ఇదే తరహాలో మోసాన్ని గుర్తించిన ఐటీ అధికారులు 200 మంది సాఫ్టువేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రిఫండ్స్ క్లెయిమ్ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News