మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వికలాంగులకు ప్రకటించిన రూ.6 వేల పింఛన్‌ను వీలైనంత త్వరగా అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి అనసూయ సీ తక్క అన్నారు. అలాగే త్వరలోనే వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని ప్రకటించారు. వికలాంగుల సమస్య లు పరిష్కరించాడినికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల క్రీడోత్సావాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా బుధవారం ఘనంగా ప్రారంభించా రు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎంఎల్సీ పట్నం మ హేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య ముత్తినేని, ఉమెన్
కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని వికలాంగులకు పండుగ రోజు మాదిరిగా ఘనంగా జరుపుకుందామని అన్నారు. ఏదో ఒక రకమైన వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మ స్థైర్యంతో, బలమైన సంకల్పంతో వికలాంగుల క్రీడల్లో ప్రపంచ స్థాయిలో పథకాలు సాధించడం నిజంగా చారిత్రిక అంశమని కొనియాడారు. వరంగల్ బిడ్డ జీవన్ జీ దీప్తి పారా ఒలింపిక్ క్రీడలలో కాంస్య పథకం సాధించి దేశం గర్వించేలా చేసిందని మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆమెకు కోటి రూపాయలు నగదు, 500 గజాల స్థలం ఇచ్చామని, గ్రూపు 2 ఉద్యోగం కూడా త్వరలోనే ఇస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా వికలాంగులు సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డీ మాట్లాడుతూ రాబోయే క్రీడా విధానంలో వికలాంగులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తామని , శాట్స్ ఎల్లప్పుడూ వికలాంగ క్రీడాకారులను ప్రోత్సాహించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ వికలాంగ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అధునాతనమైన పరికరాల కోసం రూ.3 లక్షలు కేటాయించేలా, అన్ని రకాల సహాయ ఉపకరణాలులో 5 శాతం రిజర్వేషన్‌ను కల్పించడానికి మేనేజ్ మెంట్ కమిటీలో తీర్మానం చేశామని అన్నారు. జీవన్ జీ దీప్తికి కోటి రూపాయలు నగదుతో పాటు 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం కేటాయించి నందుకు పారా స్పోర్ట్ గౌరవాధ్యక్షుడిగా, కార్పొరేషన్ చైర్మన్‌గా సమస్త వికలాంగుల తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, శాట్స్ చైర్మన్ శివ సేనా రెడీకి ధన్యవాదాలు తెలిపారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం ఎల్లపుడూ అండగా ఉంటుందని అన్నారు.