Thursday, April 25, 2024

రాత్రి ఒంటి గంటకు ఖేల్ ఖతం

- Advertisement -
- Advertisement -

New Year Eve

 

కొత్త సంవత్సర వేడుకల నిబంధనలు

మన తెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ 31 రాత్రి వేడుకలకు ఎదురుచూసేవారు.. ఉత్సాహం చూపేవారికి పోలీసులు కొంత పరిమితులు విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు ,అపశృతులు చోటుచేసుకోకుండా రాచకొండ, సైబరాబాద్ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించారు. సెలబ్రేషన్స్ నిర్వాహకులు వీటిని తప్పకుండా పాటించాలి. రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు తమ విజన్..2020 లక్ష్యాలను పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వాటిని అమల్లోకి తీసుకొస్తారు. ముఖ్యంగా మహిళలకు పటిష్ట భద్రత.. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లోనూ ఎలాంటి దుర్ఘటనలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

తప్పక పాటించాల్సిన నిబంధనలు…
నూతన సంవత్సర వేడుకులను రాత్రి 8 నుంచి 1 గంట లోపే నిర్వహించాలి. డీజేలకు అనుమతి లేదు. డ్రగ్స్, మత్తు పదార్థాలు విక్రయించొద్దు.. వాడొద్దు. వేడుకలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పక తీసుకోవాలి. ఈవెంట్లు, సెలబ్రేషన్స్ జరిగే ప్రాంతాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జా మ్‌లు తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. వేడుకల్లో అశ్లీలం ఉండకూడదు. 45 డెసిబుల్స్ కంటే ధ్వని మించకూడదు. తగిన పా ర్కింగ్ సౌకర్యం ఏర్పాటుచేసుకోవాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు.

రాత్రి ఫ్లైఓవర్ల మూసివేత…
డిసెంబర్31 రాత్రి వేడుకలను దృష్టి లో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్ పరిదిలో రాత్రి 11 నుంచి ఉద యం 5 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పాటు రెండు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లపై రాత్రి 11 నుంచి తెలవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు.

తాగి కూడా మెట్రో ఎక్కొచ్చు
డిసెంబర్ 31 వేడులకు సిద్ధమైన మహానగరంలో మెజార్టీ సెలబ్రేషన్స్ మందుతోనే జరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. స్నేహితులతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లు అర్ధరాత్రి వేళ ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా మెట్రో రైల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ ౩1 అర్థరాత్రి దాటిన తర్వాత కూడా అంటే రాత్రి 1.30 గంటల వరకూ సర్వీసులు నడుపుతామన్న మెట్రో అధికారులు.. రైళ్లలోకి మందు తాగిన వాళ్లను కూడా అనుమతిస్తామని ప్రకటించింది. సాధారణంగా మద్యం సేవించిన వాళ్లను మెట్రో రైళ్లలోకి ఎక్కనివ్వరు. అయితే మందు తాగినంత మాత్రాన తోటి ప్రయాణీకులతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించొద్దని, ఒకవేళ అలాచేస్తే రైలు దిగిపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Rules for New Year Eve
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News