Saturday, April 27, 2024

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రి/భద్రాద్రి కొత్తగూడెం /వేములవాడ : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి భువనగిరి జి ల్లా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మ ల్ జిల్లాలోని జ్ఞానసరస్వతి అమ్మవారు, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారు, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రా జన్న ఆలయం, భద్రాద్రి రామన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కూలైన్లలో గంటల తరబడి నిలబడి ఆయా స్వాములు, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. కొత్త సంవత్సరాన దేవాలయాలను సందర్శిస్తే, ఆ ఏడాదంతా తమకు శుభం జరుగుతుందనే గట్టి నమ్మకంతో తెల్లవారు జామునుంచే ఆయా ఆలయాల్లో బారులు తీరారు.
భద్రాద్రి రామయ్యకు సిబ్బంది రాపర్తి సేవ
నూతన ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అభివృద్ధిలో భద్రాద్రి జిల్లా అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తూ భద్రాచలం ఆలయ కమిటీ, సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీ రామచంద్రమూర్తికి రాపర్తి సేవ నిర్వహించారు. సోమవారం ఉదయం శ్రీ సీత లక్ష్మణ సమేత రామునికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీన ఆలయ అధికారులు, సిబ్బంది తొలి పూజ చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ రామయ్య సేవలో తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ రమాదేవి, పాలక మండలి, సిబ్బందితో పాటు భక్తులు అధిక పాల్గొన్నారు.
భక్తులతో యాదాద్రి సందడి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు రోజులు సెలవు రోజులు కావడంతో సోమవారం యాదాద్రికి భక్తజనం వివిధ ప్రాంతాల నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం తరలివచ్చిన భక్తులతో యాదాద్రి సందడి నెలకొంది. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించి స్వామివారికి అభిషేకం, అర్చక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. పిల్లాపాపలు, కు టుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగే నిత్యపూజలలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివుడకి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, హొమం పూజలు సాయంత్రం శివపార్వతుల ఊరేగింపు సేవ నిర్వహించగా భక్తులు దర్శించుకున్నారు.
రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు…
దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ కనిపించింది. కొత్త సంవత్సరం మొదటి రోజున భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. విఐపిలు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. కోడె మొక్కులు చెల్లించుకుని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News