Tuesday, May 7, 2024

రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే: ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా ముప్పెట దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమేనని ఉక్రెయిన్ రాయబారి పేర్కొన్నారు. మా రాజధానిపై వైమానిక దాడులు జరిగాయి. రష్యా దాడుల్లో సైన్యంతో పాటు భారీగా ఉక్రెయిన్ ప్రజలు మరణించారని తెలిపారు. చాలా చోట్ల జనావాసాలపై రష్యా క్షిపణులు దాడులు చేస్తున్నాయని.. రాజధాని కీవ్ తో పాటు పలు నగరాల్లో రష్యా దాడులు చేసినట్లు వెల్లడించారు. దీంతో సామాన్య ప్రజలు కూడా మృతి చెందారని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 50మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. రష్యా దాడులు చేస్తుండడంతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. ఎయిర్ పోర్టు మూసివేయడంతో పలువురు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. దీంతో భారత ఎంబసీ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది.

మరోవైపు, ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకున్న ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మారియపూల్‌లోని ఖార్ఖీవ్ ప్రాంతంలో రష్యా దళాలు బాంబులతో దాడులు చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. బాంబులతో ఉక్రెయిన్ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్ లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Russia launches Attack on Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News