Friday, May 3, 2024

వర్షపు నీరు, డ్రైనేజీ వేరు వేరుగా వెళ్లేలా నాలాల నిర్మాణం: సబితా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మీర్ పేట్, బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్లలో పర్యటించి, శుక్రవారం రాత్రి కురిసిన ఆకస్మిక వర్షంతో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. శనివారం మేయర్లు దుర్గా దీప్ లాల్, పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులతో కలిసి లోతట్టు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అనంతరం బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ”చెరువుల మధ్య నాలాలతో అనుసంధానం కోసం రూ.850కోట్ల పై చిలుకు నిధులను విడుదల చేసిన సిఎం కెసిఆర్ ప్రజల తరుపున ధన్యవాదాలు. అప్పా చెరువు తెగి తరచుగా జాతీయ రహదారి పై తోపాటు లోతట్టు ప్రాంతాలు జల దిగ్భంధంలోకి వెళ్తుండటంతో అప్పా చెరువు నుండి మునుగుండు లేక్ మీదుగా నిర్మించనున్న నాలా కోసం రూ.58.68 కోట్ల నిధులు  ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 13న టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుంది. జల్ పల్లిలో రూ.15.18 కోట్లతో చెరువుల మధ్య వర్షపు నీరు, డ్రైనేజీ వేరు వేరుగా వెళ్లేలా నాలాలను నిర్మిస్తాం.

బడంగ్ పేట్ లో రూ.68 కోట్లతో నాలాల నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల రెండవ వారంలో టెండర్ ప్రక్రియ చేపట్టి మొదటి విడతలోనే పనులు ప్రారంభిస్తాం. మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో రూ.18.36 కోట్లతో నాలాలను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 20వ తేదీలోపు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. గత కొద్ది కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా పరిశీలించి, ముఖ్యమంత్రి, మునిసిపల్ మంత్రి కెటిఆర్ లతొ కలసి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. వచ్చే ఏడాది జనవరి నాటికి అన్ని పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది” అని తెలిపింది.

Sabitha Indra Reddy Visit Meerpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News