Saturday, April 27, 2024

వీణవంకలో ప్రచారం మొదలు పెట్టిన టిఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ

- Advertisement -
- Advertisement -

TRS NRI South Africa branch started campaign in Veenavanka

 

మన తెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ వీణవంక మండలంలో ఆ పార్టీ ఎన్నారై సౌత్ ఆఫ్రిక శాఖ శనివారం ప్రచారాన్ని ప్రారంభించింది. వీణవంక మండలంలో ఇన్‌ఛార్జీ, ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి, మరో శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి,అల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక యువకులతో కలిసి సౌత్ ఆఫ్రికా శాఖ హుజురాబాద్ కాంపెయిన్ ఇన్‌చార్జ్ నల్ల శివారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రచారంలో ఎక్కడుకు వెళ్లినా పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌కు ఓటర్లు పెద్దఎత్తున మద్దతు తెలియదజేశారన్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. త్వరలోనే హుజురాబాద్ , జమ్మికుంటలో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, ఇతర కార్యవర్గ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొననున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News