మోస్టో అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’ నుంచి క్రేజీ సాంగ్ టీజర్ వచ్చేసింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో వీరద్దరూ తొలిసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం సినిమాలోని ‘సలాం అనాలి’ అంటూ సాగే సాంగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ స్టైలీష్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ తో వావ్ అనిపించారు. ఈ సాంగ్ ఫుల్ వీడియోను థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయాలని మేకర్స్ పేర్కొన్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
అదరగొట్టిన ఎన్టీఆర్, హృతిక్.. ‘వార్ 2’ నుంచి క్రేజీ సాంగ్ టీజర్ వచ్చేసింది
- Advertisement -
- Advertisement -
- Advertisement -