Tuesday, September 23, 2025

ఒకే జిమ్‌లో రాజ్ నిడమోరుతో సమంత..

- Advertisement -
- Advertisement -

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. రీసెంట్‌గా ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారింది. అయితే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరుతో కలిసి పలు చోట్ల ఆమె కెమెరా కంటికి చిక్కింది. అతనితో కలిసి ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది సామ్.

అయితే ఇటీవల వీరిద్దరు దుబాయ్‌లో జంటగా కనిపించారు. తాజాగా మరోసారి కెమెరా కంటికి చిక్కారు. బాంద్రాలోని ఓ జిమ్‌లో సామ్ (Samantha), రాజ్ బయటకి వస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి ఇలా కనిపించడంతో మరోసారి డేటింగ్ వార్తలకు ఊతమిచ్చినట్లైంది.

రాజ్, సమంతలు కలిసి ‘హనీబన్నీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లకు కలిసి పని చేశారు. ఈ క్రమంలో వీరిద్దర మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత చాలాసార్లు పలు ఈవెంట్లలో వీరిద్దరు జంటగా కనిపించారు. కానీ, ఈ డేటింగ్ వార్తలపై సామ్ కానీ, రాజ్ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు.

Also Read : ఫ్యాన్స్‌కి ‘మిరాయ్’ కానుక.. థియేటర్‌లో ఇక సందడే సందడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News