Thursday, May 2, 2024

‘యశోద’గా సమంత..

- Advertisement -
- Advertisement -

 

Samantha starts new pan India movie

హైదరాబాద్:హిందీ వెబ్ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్ 2’తో హీరోయిన్ స‌మంత జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో ఈ అమ్మడి దృష్టి బాలీవుడ్ పై పడింది. సౌత్ తోపాటు బాలీవుడ్ లోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది సామ్. ఇందులో భాగంగా పలు ప్రాజెక్టులను లైన్ లో పెడుతోంది. తాజాగా సమంత పాన్ ఇండియా మూవీని పట్టాలెక్కించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న లేడీ ఓరియెంట్‌డ్ సినిమాలో స‌మంత న‌టిస్తుంది. కొద్దిసేపటిక్రితం ఈ మూవీ టైటిల్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘యశోద’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది.  థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ వైడ్ గా అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం” అని తెలిపారు. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నార‌ు.

Samantha starts new pan India movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News